Viral: మనుషులే కాదు పానీపూరి అంటే జంతువులకు కూడా పిచ్చే
గుజరాత్‌లోని తంకారలో కోతులు పానీపూరిని ఆస్వాదిస్తున్న వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో కోతి పానీపూరి దుకాణం వద్దకువచ్చి దానిపై కూర్చుంది, పానీపూరి అమ్మే అతను గోల్గప్పాలను సిద్ధం చేసి కోతికి అందించగా అది ఇష్టంగా తినడం కనిపిస్తోంది.
Viral: ఈ రోజుల్లో పానీ పూరీని ఇష్టపడని వారు ఉండరు. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరికీ పానీపూరీ అంటే అమితమైన ఇష్టం. చక్కగా పానీ పూరీలో ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. గాల్లో తేలినట్లుంటుంది. పానిపూరి తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. అంతెందుకు పానీపురీ బండి పక్క నుంచి వెళ్తే నోరు ఊరిపోతుంది. మనుషులే కాదు జంతువులకు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయి. ప్రస్తుతం కోతి, ఏనుగు పానీ పూరి తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏనుగు ఏకంగా పానీపూరీని తినేస్తోంది. ఈ వీడియోలో ఏనుగు పానీపూరీ బండి పక్కన నిలబడి తొండంతో పానీపూరీలను తీసుకొని తినేస్తోంది. పానీపూరీ అమ్మే వ్యక్తి… ఏనుగుకు పానీపూరి అందిస్తున్నాడు. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు చాలా మంది జనం అక్కడికి చేరి ఎంతో ఆనందంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. చాలామంది ఈ అరుదైన సన్నివేశాన్ని చూసి తమ మొబైళ్లలో రికార్డు చేస్తున్నారు.
గుజరాత్‌లోని తంకారలో కోతులు పానీపూరిని ఆస్వాదిస్తున్న వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో కోతి పానీపూరి దుకాణం వద్దకువచ్చి దానిపై కూర్చుంది, పానీపూరి అమ్మే అతను గోల్గప్పాలను సిద్ధం చేసి కోతికి అందించగా అది ఇష్టంగా తినడం కనిపిస్తోంది. తంకారలోని దయానంద్ చౌక్‌లో ఈ ఘటన జరగ్గా దీన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో స్ధానికులు స్టాల్ వద్ద గుమికూడారు.