TG: భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా సాగుతోంది. మధ్యాహ్నం మిథిలా మండపంలో సీతారాముల కళ్యాణం జరుగుతోంది. సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు 300 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేసేందుకు మొత్తం 80 కౌంటర్లు పెట్టారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.