TG: గత పదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం వల్ల వందేళ్ల నష్టం వాటిల్లిందని, తాము పాత అప్పులు చెల్లిస్తూనే తప్పులు సవరిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. గత పదేళ్లలో పెంచని డైట్, కాస్మెటిక్ ఛార్జీలను తమ ప్రభుత్వం పెంచి విద్యార్థులకు అండగా నిలిచిందని తెలిపారు. తాము నిరంతరం పనిచేస్తుంటే కొందరు గోతులు తవ్వుతున్నారని, అలాంటి వారిని ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని మండిపడ్డారు.