TG: రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్ సవాల్ విసరడం నిజంగా సిగ్గుచేటు అంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ‘9 ఏళ్లు పాలించి లక్షలోపు రుణమాఫీ చేయలేకపోయారు. ఒకే ఏడాదిలో రైతు రుణమాఫీ కోసం మా ప్రభుత్వం రూ.21 వేల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ రైతుల కష్టాన్ని చూసిన ఒక రైతు బిడ్డగా సీఎం రేవంత్ రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశారు’ అని పేర్కొన్నారు.