AP: స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయంగా ఉన్నత పదవులు స్వీకరించినా రాని తృప్తి.. స్వర్ణభారత్ ట్రస్ట్ సేవల ద్వారా వస్తుందని చెప్పారు. ట్రస్ట్ ద్వారా అనేక మంది రోగులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. తన తర్వాత కూడా ట్రస్ట్ సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు.