PLD: చిలకలూరిపేట సాంబశివనగర్లో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం పింఛన్, ఉచిత మందులు, ఉచిత వైద్యసేవల్ని అందిస్తోందన్నారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్య రక్షణకు కేంద్రప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు.