ATP: ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నాగసముద్రంలో నేడు అత్యధికంగా 40.9°C ఉష్ణోగ్రత నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ నీళ్లు తాగాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.