అనంతపురం: రామగిరి మండలంలో కురబ లింగమయ్యను పరిటాల చిన్నాన కొడుకు రమేశ్, అతని కొడుకు ఆదర్శ్, నాయుడు, ఆదిత్య, నవకాంత్ కలిసి రాడ్లతో కొట్టారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగమయ్య చనిపోయాడని అన్నారు. పోలీసులు టీడీపీ వాళ్లకి మద్దతు పలుకుతున్నారని, ఏం చేసినా చెల్లుతుందని వాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.