HNK: ముస్లిం సహోదరులకు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలన్నారు.