కృష్ణా: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినం అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాసం చేస్తూ.. దైవ ప్రార్థనల్లో పాల్గొంటారన్నారు. ముస్లింల అత్యంత పవిత్రమైన గ్రంథంగా ఖురాన్ అవతరించిందన్నారు.