MNCL: మండల సమైక్య ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యానికి మించిన బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశామని APM విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నెన్నెల మండల IKP కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. రూ 24.32 కోట్ల లక్ష్యం కాగా రూ.27.69 కోట్లు అందజేశామన్నారు. రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించిన 471 సంఘాలకు రూ.62.98లక్షల వడ్డీమాఫీ వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.