ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మరణం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. థాయ్‌లాండ్‌లో ఓ విల్లాలో వార్న్ చనిపోగా.. అందుకు గుండెపోటు కారణమని భావించారు. తాజాగా ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఘటనాస్థలంలో లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఔషధ బాటిల్ లభ్యమైనట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. దానిని అక్కడనుంచి తొలగించాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు.