దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానంపై రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు NEPపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు వంటి నేర ప్రవృత్తి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.