VZM: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బొబ్బిలి కోటలోని సుమారు 500 కుటుంబాలకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం రంజాన్ తోఫా కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరూ సోదర భావంతో మెలుగుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. అనంతరం ముస్లిం కుటుంబాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపాయి.