TG: సీఎం రేవంత్ రెడ్డిపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశంసల వర్షం కురింపించారు. ‘మునుగోడులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో రేవంత్ మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది. బర్రెలు, గొర్రెలు, చేప పిల్లలు ఇచ్చారు. కానీ నాణ్యమైన విద్యను అందించలేదు. విద్య మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్లిపోయింది’ అని అన్నారు.