ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. 10 నిమిషాల యోగా లేదా స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేస్తే శరీరానికి శక్తినిస్తాయి. నిద్రలేచిన తర్వాత గంట సేపు మొబైల్ చూడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజు చేయాల్సిన పనులను ఒకసారి గుర్తుచేసుకోవాలి.