TG: కరక్కాయ ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఔషధం. దీనిని ‘సర్వరోగ నివారిణి’ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మన శరీరంలోని త్రిదోషాలను(వాత, పిత్త, కఫ) సమతుల్యం చేయడంలో ఇది అధ్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తోంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే.. కరక్కాయ పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి.