AP: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ విశాఖలోని రెండో అదనపు కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ కేటాయించాలని 2016 ఏప్రిల్లో అమర్నాథ్ ఆందోళనలు నిర్వహించారు. స్థానిక GVMC గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.