AP: గత ప్రభుత్వం టీటీడీలో టెండర్లను మార్చిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ తెలిపిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో హిందూ మతంపై కుట్ర చేశారని విమర్శించారు. వైసీపీ నేతలకు దేవుడిపై నమ్మకం లేదన్నారు. ఇష్టానుసారంగా నిబంధనలను మార్చేశారని మండిపడ్డారు.