AP: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి లోకేష్ TG సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇద్దరు నేతలు కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు ఒకే వేదికపై కలవడంతో ఈ వివాహ వేడుక రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.