ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో 11,870 ఇంటి పన్నుల అసెస్మెంట్లు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5.50 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు రాబట్టారు. బకాయిల్లో సుమారు 50% వసూలు జరిగిందని, మార్చి 31వ తేదీ లోపు బకాయిలు చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమణ బాబు హెచ్చరికలు జారీచేశారు.