SDPT: మద్దూరుకు చెందిన క్రీడాకారుడు బెజడి కార్తీక్ గౌతమ్ రెడ్డి జాతీయ స్థాయి సీనియర్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 23నుంచి 27 వరకు హర్యానాలోని కురుక్షేత్రలో జరగనున్న ఈ పోటీల్లో ఆయన పాల్గొంటారని ఉమ్మడి మెదక్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి విజయ్ బాబు తెలిపారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు గౌతమ్ రెడ్డిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.