NTR: తిరువూరు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను శాప్ డీఈ అనిల్ బుధవారం పరిశీలించారు. ఇటీవల కాలంలో ఇండోర్ స్టేడియంలోని షటిల్ కోర్టు కుంగిపోయింది. దీంతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. దీంతో టీడీపీ నేతలు కాళీ వర ప్రసాద్, కిరణ్, సందీప్ శాప్ ఛైర్మన్‌ను కలిసి మరమ్మతులు చేయించాలని కోరారు. డీఈ అనిల్ షటిల్ కోర్టును పరిశీలించి వారం రోజుల్లో పనులు చేపడతామని తెలిపారు.