MLG: జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని డబీర్పూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధ హజరత్ షా సబీల్ చిస్తీ దర్గాను సందర్శించారు. ఆయనకు ఆప్తమిత్రులైన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన మేడ్చల్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దైవదర్శనం చేసుకున్నారు.