90% నీరుండే తాటిముంజలు వేసవి తాపాన్ని తగ్గించే సహజ ఎలక్ట్రోలైట్లు. వీటిలోని ఫైబర్, విటమిన్ ఎ, సి, కె రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొటాషియం గుండెకు, తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ మధుమేహులకు మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, గర్భిణులకు ఇవి ఉత్తమ ఆహారం. వీటిని పేస్టులా ముఖానికి రాస్తే చర్మం కాంతిమంతంగా మారి, చెమటకాయలు తగ్గుతాయి.