పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. అయితే లోక్సభలో విపక్ష సభ్యులు తమ ఆందోళనలను కొనసాగించారు. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ముఖ్యంగా బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు డిమాండ్ చేశాయి. విపక్షాల నిరసనలు, ఆందోళనల మధ్య ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.