AP: తిరుమలకు రూ. 750లకు ఆవు నెయ్యి సరఫరా చేయడాన్ని YCP నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పుబట్టారు. ‘మార్కెట్లో kg హెరిటేజ్ నెయ్యి రూ. 541 ఉంది. ఇందాపూర్ నెయ్యి రూ. 578గా ఉంది. అమూల్ నెయ్యి రూ.525 ఉంది. బయట మార్కెట్ లో అమ్మే ఆవు నెయ్యి తక్కువకు ఎలా వస్తుంది.. తిరుమలకు మాత్రం ఎక్కువ ధరకు ఎందుకు తీసుకుంటున్నారు. ప్రజలు వాడే నెయ్యి కల్తీ జరిగిందా?’ అని నిలదీశారు.