కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కమలాపురం(మం) రామచంద్రపురం పరిధిలో టిప్పర్ స్కూటర్‌ను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జంగంపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.