TG: లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నామని CM రేవంత్ తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు చెప్పారు. శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని హితవు పలికారు. శాంతి మార్గంతోనే గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించారని గుర్తు చేశారు.