ATP: పెద్దపప్పూరు మండల కన్వీనర్‌గా నియమితులైన మూల శ్రీనివాస రెడ్డి శనివారం తాడిపత్రిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.