ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన విమాన సర్వీసులను పునఃప్రారంభించింది. గతంలో జారీ చేసిన రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులు నేరుగా విమానాశ్రయానికి రావచ్చని సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, వెబ్సైట్ ద్వారా ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఎమిరేట్స్ సూచించింది.