AP: మంత్రి లోకేష్ మానవత్వంతో వ్యవహరించిన తీరుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతఙ్ఞతలు తెలిపారు. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతికి తరలించడానికి సొంత ఖర్చులతో ప్రత్యేక విమాన ఏర్పాటు చేయడంపై ప్రశంసలు కురిపించారు. మంత్రి సకాలంలో స్పందించడం కారణంగానే గుండె మార్పిడి సాధ్యమైందని కొనియాడారు. కాగా, లోకేష్ సేవాగుణంపై ప్రజలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.