TG: అసెంబ్లీని గాంధీభవన్‌లా మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టీ బ్రేక్ విరామం అని చెప్పి గంటలు గంటలు కాలయాపన చేశారని, తమను సస్పెండ్ చేసి కీలక బిల్లులు పాస్ చేసుకున్నారని తెలిపారు. సభలో నాటకాలు చాలవన్నట్లు బయటకు వెళ్లి నాటకాలు వేశారన్నారు. అసెంబ్లీ బిజినెస్‌ను పక్కనపెట్టి ఆటలు, నాటకాలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సమావేశాలు దశ దిశ లేకుండా సాగాయన్నారు.