భారతదేశ వైద్యరంగంలో గాడ్‌మదర్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ ఎస్.ఐ. పద్మావతి ప్రయాణం స్పూర్తిదాయకం. బర్మా నుండి వలస వచ్చి దేశంలోనే తొలి క్యాత్ ల్యాబ్‌ను స్థాపించి వైద్యరంగంలో విప్లవం తెచ్చారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి, 90 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవ చేస్తూ ఆదర్శంగా నిలిచారు. గుండె వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిది.