భూకంపం ధాటికి మయన్మార్, థాయ్లాండ్ అతలాకుతలం అయ్యాయి. భూకంపం తీవ్రతకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మయన్మార్లో ఇప్పటివరకు 200 మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 40కి పైగా భారీ అంతస్తులు కూలాయి. కూలిన భవనాల శిథిలాల్లో దాదాపు 1000 మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. బాధితులను కాపాడేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.