ATP: ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారికి అన్ని రకాలుగా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు పవిత్ర రంజాన్ పురస్కరించుకొని ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఈద్గా మైదానం వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.