సత్యసాయి: మడకశిర ప్రాంతంలో వాహనదారులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ నాగేశ్ బాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అదుపు చేయలేని వేగం, అవగాహన లేని డ్రైవింగ్ ప్రాణానికి ముప్పు తెస్తుందన్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు పెళ్లరాదని, హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలన్నారు.