సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు గ్రామానికి చెందిన కౌలు రైతు హలీమా కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ కానుక అందజేశారు. పవన్ తరఫున పట్టుచీర, రూ.25,000లు ఆర్థిక చేయూత, పండ్లతో కూడిన రంజాన్ తోఫాను జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, ఆ పార్టీ కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఆ కుటుంబ సభ్యులు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.