కృష్ణా: ఘంటసాల మండలం గోటకం కాలనీ ఆర్థిక సమతా మండలి కమ్యూనిటీ హాలులో సోమవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో అవనిగడ్డ బ్రాంచ్, రేపల్లె కంటి ఆసుపత్రి డాక్టర్ కిషోర్, డాక్టర్ దాస్ పర్యవేక్షణలో ఆప్తో మెట్రిస్ట్ మేరుగు ప్రవీణ్ 180మందికిపైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందించారు.