KMR: లింగంపేట మండలం ముంబోజిపేట్ తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కును సోమవారం లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ నాయక్ మాట్లాడుతూ.. మంజ అనుబాయ్ అనే లబ్ధిదారునికి రూ. 27,000 చెక్కును అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభావత్ రవి, ప్రకాష్, మహేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.