NLG: చిట్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మునుగోడు మండలం చోల్లేడు గ్రామానికి చెందిన పరమేశ చిట్యాలలోని మార్కెట్ నుంచి దోసకాయల బస్తాలు తీసుకొని బైక్పై పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి నార్కెట్ పల్లి వైపు వెళ్తున్న కారు బైక్ను ఢీకొట్టింది.