KMR: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామం 12వ వార్డులో రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం సుమారు 20మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు మాజీ కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దోల్ల శశిధర్ రావు, నీలం రాజలింగం, ద్యావరి నరేష్, బాలస్వామి, భాను, గణేష్, చిన్న నరేష్ తదితరులు పాల్గొన్నారు.