అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పశువులకు నీటి సమస్య తలెత్తకుండా నీటితోట్ల నిర్మిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సందేపల్లి మండలం, కొండావాండ్లపల్లెలో పశువుల నీటి తొట్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలిపారు.