BPT: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం కర్లపాలెం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధార్మిక కార్యక్రమాల కోసం దూరదృష్టితో పూర్వికులు తమ ఆస్తులను వక్ఫ్ చేశారని తెలిపారు.