AP: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అంతరాయాలపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. అధిక వేడి, గాలి వానల వల్లే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్ కోతలపై ప్రజలకు సమాచారం అందించాలని.. 24 గంటలూ 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండాలని, నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.