మీ ఆరోగ్య స్థితిని మూత్రం రంగు ద్వారా గుర్తించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. తెలుపు రంగు నీరు ఎక్కువగా తాగుతున్నట్లు సూచిస్తుంది. ఆరెంజ్ లేదా బ్రౌన్ రంగులో ఉంటే డీహైడ్రేషన్ లేదంటే లివర్ సమస్య ఉండవచ్చు. ఒకవేళ ఎరుపు రంగులో వస్తే అది కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.