మనం చదివే వైవిధ్యమైన పుస్తకాలు మన ఆలోచనలు, సంభాషణల్లోని లోతును పెంచుతాయి. మనం పాటించే కఠిన ఆరోగ్య సూత్రాలు మనలోని శక్తిని ఉత్తేజితం చేస్తాయి. సాకులు చెప్పకుండా మనం స్థిరత్వంతో చేసే పని మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మన సన్నద్ధత ఎంత మెరుగ్గా ఉంటే, మనకొచ్చే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి.