AP: వైసీపీ నేతలు దేవుడి పట్ల భక్తి, భయం లేకుండా ప్రవర్తిస్తున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ప్రజలకు జగన్, వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వేంకటేశ్వరస్వామి ఫొటోలు, ఫ్లకార్డులను వాడటం దుర్మార్గమన్నారు. స్వామివారి ఫొటోను ఒకరు తలకిందులుగా పట్టుకున్నారని.. నిరసన అవగానే ఇంకొకరు టేబుల్‌పై పడేశారని చెప్పారు.