ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ గుడ్న్యూస్ చెప్పారు. హోలీ పండగను పురస్కరించుకుని ఫిబ్రవరి నెల వేతనాలను గడువు కంటే ముందే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. MAR 4న హోలీ పండగ చేసుకుంటున్న నేపథ్యంలో పండగ ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇవాళే జీతాలు జమచేయాలని సీఎం యోగి ఉత్తర్వులు జారీ చేశారు.