TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. ‘బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఆడియోలు, వీడియోలు ఉన్నాయని బెదిరించడం కాదు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి. కల్వకుంట్ల కుటుంబంపై విచారణకు ఆదేశిస్తే.. బీజేపీ ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నించారు.